
AP Inter Board: కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విద్యా సంవత్సరంలో కాలేజీలు మొత్తం 127 రోజులు పని చేయనున్నట్లు ప్రకటించింది. ఏప్రిల్ 25 నుంచి మే 31 వరకు వేసవి సెలవులు ఉంటాయని పేర్కొంది. ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం వార్షిక పరీక్షలను వచ్చే సంవత్సరం మార్చి చివరి వారంలో నిర్వహించనున్నారు. ఈ మేరకు ఇంటర్మీడియట్ విద్యామండలి అకడమిక్ కేలండర్‌ను విడుదల చేసింది. ఏప్రిల్ 24 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఏప్రిల్ 25 నుంచి మే 31 వరకు వేసవి సెలవులు ఉంటాయి. జూన్ చివరి వారంలో అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తారు. ఈ విద్యా సంవత్సరంలో రెండో శనివారం కూడా తరగతులు నిర్వహిస్తారు. ఇక ఈసారి అకడమిక్ ఇయర్‌లో టర్మ్ సెలవులు రద్దు చేస్తున్నట్లు ఏపీ ఇంటర్ బోర్డు అధికారులు తెలిపారు. మొత్తం 127 రోజులు కాలేజీలు పని చేయనున్నాయి. జూన్ 1 నుంచి 2021-2022 విద్యా సంవత్సరం ప్రారంభమవుతుంది. విద్యార్థులు పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు.
from Education News in Telugu: News on Board Exam Results, Job Notifications, University Results in Telugu https://ift.tt/2TPVG95
No comments:
Post a Comment