digital marketing jobs

Tuesday, October 27, 2020

అన్‌లాక్‌ 5.0: స్కూళ్లు, కాలేజీల ప్రారంభంపై క్లారిటీ

కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్‌ 30న విడుదల చేసిన అన్‌లాక్‌-5 మార్గదర్శకాలను వరకు పొడిగిస్తూ నిర్ణయం ప్రకటించింది. కంటైన్‌మెంట్‌ జోన్ల బయట అన్ని రకాల కార్యకలాపాలకు అనుమతిస్తున్నట్లు స్పష్టం చేసింది. అన్‌లాక్-5 అక్టోబర్ 31తో ముగుస్తున్న నేపథ్యంలో కేంద్రం తదుపరి ఉత్తర్వులు జారీ చేసింది. అన్‌లాక్-5 మార్గదర్శకాలనే మరో నెల పాటు (నవంబర్ 30) పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పండగల కాలం కావడంతో ఇక ఎలాంటి సడలింపులు ఇవ్వకూడదని నిర్ణయించినట్లు తెలుస్తోంది. అక్టోబర్‌ నెలకు ప్రకటించిన నిబంధనలే నవంబర్‌ నెలాఖరు వరకు వర్తిస్తాయని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ మంగళవారం (అక్టోబర్ 27) సాయంత్రం ఒక ప్రకటనలో పేర్కొంది. జనం గుమిగూడటానికి సంబంధించిన కొన్ని కార్యకలాపాలను మాత్రం కొన్ని నియంత్రణలు, ప్రామాణిక నిబంధనలతో అనుమతిస్తున్నట్లు గుర్తు చేసింది. ఈ కారణంగానే రెస్టారెంట్లు, హోటళ్లు, మెట్రోరైళ్లు, షాపింగ్‌ మాల్స్‌, మత కేంద్రాలు, యోగా శిక్షణ కేంద్రాలు, జిమ్‌లు, పార్క్‌లు, సినిమా హాళ్లు తెరుచుకున్నట్లు పేర్కొంది. Must read: రాష్ట్రాలకే స్కూళ్లు, కాలేజీలపై నిర్ణయం:కరోనా వైరస్‌ వ్యాప్తికి ఎక్కువ అవకాశం ఉన్న కార్యకలాపాల పునఃప్రారంభంపై నిర్ణయం తీసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకే వదిలి పెట్టింది. ముఖ్యంగా స్కూళ్లు, కోచింగ్‌ సెంటర్లు, ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీలు, యూనివర్సిటీలు, 100 మందికి మించి గుమిగూడే కార్యకలాపాలకు సంబంధించి అనుమతి విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలే నిర్ణయం తీసుకోవచ్చని పేర్కొంది. ఇక కరోనా వైరస్‌ వ్యాప్తి ఇంకా కొనసాగుతున్నందున ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్రం సూచించింది. కంటైన్‌మెంట్‌ జోన్లలో నవంబర్ 30 వరకు అన్ని రకాల ఆంక్షలు కొనసాగుతాయని స్పష్టం చేసింది. Must read:


from Education News in Telugu: News on Board Exam Results, Job Notifications, University Results in Telugu https://ift.tt/3kDHWtQ

No comments:

Post a Comment

CIA Sees "Once-In-A-Generation" Spy Recruiting Opportunity In Russia

US CIA Director William Burns said on Saturday that the armed mutiny by mercenary leader Yevgeny Prigozhin was a challenge to the Russian st...