కరోనా కారణంగా అందరి చూపు ఆన్‌లైన్ కోర్సులవైపు పడింది. ఈ క్రమంలో వందలకొద్దీ కోర్సులను దూరవిద్య పద్ధతిలో నిర్వహిస్తున్న (ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం) ప్రస్తుతం సర్టిఫికెట్, డిప్లొమా, డిగ్రీ, పీజీ, డాక్టోరల్, తదితరాలకు సంబంధించి 200కుపైగా కోర్సులను ఆఫర్ చేస్తోంది. వీటిలో 13 ఆన్‌లైన్ కోర్సులున్నాయి. అయితే.. జులై 2020 సెషన్ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. Must read: ఈ జూలై సెషన్‌లో భాగంగా ఇగ్నో వివిద సబ్జెక్టుల్లో యూజీ, పీజీ, డిప్లొమా, పీజీ సర్టిఫికెట్, పీజీ డిప్లొమా ప్రోగ్రామ్స్, అప్రిసియేషన్ లేదా అవేర్‌నెస్ ప్రోగ్రాములను అందిస్తోంది. ఈ సెషన్‌కు సంబంధించి దరఖాస్తు గడువును మరోమారు పొడిగించింది. ఆసక్తి గల అభ్యర్థులు సెప్టెంబర్ 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులను అధికారిక వెబ్‌సైట్ ద్వారా చేసుకోవాలి. కరోనా నేపథ్యంలో దరఖాస్తు గడువును ఇప్పటికే పలుమార్లు పొడిగించింది. షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 31తోనే గడువు ముగిసిపోయింది. Must read:
from Education News in Telugu: News on Board Exam Results, Job Notifications, University Results in Telugu https://ift.tt/31WzQ8v
No comments:
Post a Comment